శ్రీశ్రీకి మంచి స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్‌బిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన శ్రీశ్రీ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో హీరో కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు తెలుగు సినిమా ఆడని దేశాల్లో కూడా శ్రీశ్రీ చిత్రాన్ని విడుదల చేయడం, అక్క డ కూడా మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా వుందని, సినిమాకు చాలా మంచి ఆదరణ లభిస్తోందని, ముఖ్యంగా డైలాగ్స్‌కి క్లాప్స్ కొడుతున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన చిత్రమిదని అన్నారు. యంగ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించడం వారి మొదటి చిత్రం ఇంత మంచి టాక్ తెచ్చుకోవడం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ.. కృష్ణగారితో ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, 6 సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఆయన నటించిన సినిమా ఇదని, ఇందులో ఆయన అద్భుతంగా నటించారని, రోజురోజుకి కలక్షన్లు పెరుగుతున్నాయని అన్నారు. విదేశాల్లో ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేశామని, అక్కడ కూడా మంచి ఆదరణ దక్కిందని, కృష్ణగారి కెరీర్‌లో ఈ సినిమా గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు.