సంఘవి మళ్లీ వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాజ్‌మహల్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన సంఘవి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సంఘవికి సింధూరం సినిమా చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించిన గ్లామర్ భామ సంఘవి ఈమధ్యే పెళ్లిచేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది సంఘవి. ఇప్పటికే రెండు తమిళ చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పిందట. తన వయసుకు తగ్గ పాత్రల్ని చేయాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే తెలుగులో కూడా ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా నటిగా ప్రూవ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరి సంఘవి రీ ఎంట్రీ ఇస్తూ ఎలాంటి పాత్రలు చేస్తుందో చూడాలి!