త్రివిక్రమ్‌తో కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలెంటెడ్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఇటీవలే రూపొందించిన ‘అ ఆ’ సినిమా మంచి హిట్ టాక్‌తో రన్ అవుతోంది. చక్కటి కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. ‘అ ఆ’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘త్రివిక్రమ్ రూపొందించిన అ ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నైజాంలో మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. విడుదల చేసిన ఐదురోజుల్లోనే 12 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించింది. నితిన్ కెరీర్‌కు ఇదొక టర్నింగ్ పాయింట్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లందరూ ఆనందంగా ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం 60 కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేస్తుంది. త్రివిక్రమ్‌తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాను. ‘నువ్వేకావాలి’ సినిమా అప్పటినుంచి నాకు మంచి స్నేహం ఉంది. సినిమాల గురించి ఎన్నో విషయాలు చర్చించుకుంటాం. ఇప్పుడు మా బ్యానర్‌లో ఆయనతో ఓ భారీ సినిమా ప్లాన్‌చేస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన మిగతా వివరాలు తెలియజేస్తా’ అని అన్నారు.