ఐదు భాషల్లో క్యాంపస్ అంపశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్యామ్‌కుమార్, పావని, వౌనిక ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ జైని దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మిస్తున్న చిత్రం ‘క్యాంపస్ అంపశయ్య’. హిందీలో కూడా డబ్‌చేసి విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హిందీ పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కె.వి.రమణాచారి మాట్లాడుతూ, ప్రభాకర్ తన శిష్యుడని, కళలు, సాహిత్యాల పట్ల మక్కువ చూపించేవాడని, లక్ష్యం వుంటే ఏదైనా సాధించొచ్చు అనే దానికి అంపశయ్య నవలే నిదర్శనమని అన్నారు. ఆ నవల ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచిందని, 45 ఏళ్ళు దాటుతున్నా ఆ ప్రభావం తగ్గలేదని, అలాంటి కానె్సప్ట్‌ని తెరకెక్కిస్తున్న ప్రభాకర్‌ను అభినందిస్తున్నానన్నారు. అంపశయ్య నవీన్ మాట్లాడుతూ, 1969లో వచ్చిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, విద్యార్థుల మానసిక సంఘర్షణతో నడిచే కథ ఇదని, ఈ నవలను సినిమాగా చేయాలని చాలామంది అడిగారని, కానీ ప్రభాకర్ ఒక్కడే సినిమాగా చేశాడన్నారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ, ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేశామని, ఇప్పుడు హిందీలో విడుదల చేస్తున్నామని, క్యాంపస్‌లో చదివే ప్రతి విద్యార్థి అంపశయ్య స్టేజిని దాటి వచ్చినవాడే అన్నారు.