భవిష్యత్‌కు రైట్..రైట్ చెప్పారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్
‘పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకునే కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో కండక్టర్ అవుతాడు. ఆ తరువాత ఏం జరిగిందనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఇది’ అని అంటున్నాడు యువ హీరో సుమంత్ అశ్విన్. ‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరోగా పరిచయమైన సుమంత్ అశ్విన్, ఆ తరువాత విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘రైట్ రైట్’. బాహుబలి ప్రభాకర్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న సందర్భంగా సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు..
కెమిస్ట్రీ కుదిరింది
సాధారణంగా హీరో హీరోయిన్లమధ్య కెమెస్ట్రీ కుదిరిందంటారు. కానీ నాకు, ప్రభాకర్‌కుమధ్య ఈ సినిమాలో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సినిమాలో ప్రభాకర్ చాలా ఇన్‌వాల్వ్ అయ్యాడు. ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్లుగా ఇమిడిపోయాం. ఇందులో కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా వున్నాయి. అవి చేసే ముందు ఇద్దరం కలిసి ఎలా పండించాలని డిస్కస్ చేసేవాళ్ళం.
మారుమూల పల్లెల్లో
ఈ కథ రీత్యా మారుమూల గ్రామం కావాలి కాబట్టి అరకు, ఒడిశా బార్డర్ అయిన గవిటి అనే ఊరుని ఎంపిక చేశాం. అక్కడ కరెంట్ వుండదు. సెల్‌ఫోన్లు పనిచేయవు. క్రూరమృగాలు కూడా సంచరిస్తాయి. కథకు కరెక్టు సరిపోయింది కాబట్టి అక్కడే షూటింగ్ చేశాం.
పోలీస్ అవ్వాలనుకుని..
పోలీసు ఆఫీసర్ అవ్వాలనుకునే కుర్రాడి కథే ఇది. కానీ, అనుకోని పరిస్థితులవల్ల కండక్టర్ అవుతాడు. కొత్తగా ఆ ఊరికి విధుల్లో వస్తాడు. డ్రైవర్‌కు, కండక్టర్‌కు మరియు గ్రామస్థులమధ్య జరిగే కథ. ఇందులో బస్సు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దాంతోపాటు ప్రేమకథ వుంటూనే సస్పెన్స్ థ్రిల్లర్‌గా వుంటుంది.
మార్పులు చేశాం
ఆర్డినరీ పేరుతో మలయాళంలో హిట్ అయిన సినిమా ఇది. తెలుగు నేటివిటీ కోసం చాలా మార్పులు చేశాం. ఇందులో ప్రభాకర్ పాత్ర కూడా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకూ నెగెటివ్ పాత్రలో చేసిన ఆయన మొదటిసారి పాజిటివ్‌గా కన్పిస్తాడు. తను చేసిన కొన్ని సీన్లు చూసి అక్కడివారంతా చప్పట్లు కొట్టారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలోలా శ్రీహరిని మరిపించాడు.
కథ నచ్చే
నిజానికి ఈ సినిమా కోసం నన్ను హీరోగా ఎందుకడుగుతున్నారని నాన్నగారు అడిగారు. కథ ప్రకారం అచ్చమైన రాజమండ్రి కుర్రాడిలా కన్పించాలని, దానికి మీవాడైతే కరెక్టు అని చెప్పడంతో ఈ సినిమా చేయడానికి ఓకె చెప్పా. ఏ కథైనా ముందు నేనే వింటాను. ఆ తరువాత బాగుందనిపిస్తే నాన్న సలహా తీసుకుంటాను. ఆయనకు 25 ఏళ్ల అనుభవం వుంది కదా!
నమ్మకం వుంది
ఈ సినిమా చేసిన తరువాత ఇంత త్వరగా అయిపోయిందా అనిపించింది. అందరం అంతగా కనెక్ట్ అయ్యాం. అలాగే దర్శకుడు మనూ కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆడియోతోపాటు ఫొటోగ్రఫి సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. తప్పకుండా ఈ సినిమా మా అందరికీ మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకం వుంది అన్నారు.

-శ్రీ