జమున, కైకాలకు 12న ‘మా’ సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పరిశ్రమలో సీనియర్ నటులను గౌరవించుకోవడం సంప్రదాయం. అది బాధ్యత కూడా. ఎక్కువకాలం సినీ పరిశ్రమకు సేవలు అందించిన సీనియర్‌లను ఎంపిక చేసి దశలవారీగా వారిని సత్కరించుకునేందుకు ఎజిఎమ్ మీటింగ్‌లను వేదికగా చేస్తున్నామని’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి మేటి కథానాయిక జమున ఎంతో అనుభవమున్న సీనియర్ నటీమణి అని, ఎక్కువకాలం పరిశ్రమలో కథానాయికగా కొనసాగారని, నాటి తరంలో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె, ఎన్టీఆర్, ఎఎన్నార్‌లవంటి స్టార్లకు సమకాలికులుగా గౌరవాన్ని పొందారని ఆయన తెలిపారు. అదేవిధంగా నవరసాలను వెండితెరపై పోషించిన గొప్ప నటుడు కైకాల సత్యనారాయణను ఈసారి సన్మానించాలని తీర్మానించామని, ఈ కార్యక్రమం దాసరి నారాయణరావు చేతులమీదుగా జరగనుందని ఆయన తెలిపారు. ఈ వేడుకకు పరిశ్రమలోవున్న నటీనటులంతా వస్తారని, మేటి నటుల్లో సీనియర్‌లకు ఈ సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. నిర్మాతల మండలి హాల్‌లో జూన్ 12న ఉదయం 9 గంటలకే సన్మాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని, కైకాల, జమునలకు సన్మానం చేస్తామని, ఇదేవిధంగా సీనియర్ నటీనటులందరినీ ఎంపిక చేసి పలు దఫాలుగా జనరల్ బాడీ సమావేశాల్లో సన్మానాలు చేయాలని మా కమిటీ నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి శివాజీరాజా వివరించారు.