రెడీ... యాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 150వ చిత్రం తమిళ ‘కత్తి’ రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అనుష్కను కథానాయికగా అనుకున్న తరువాత పాటల చిత్రీకరణతో షూటింగ్ మొదలుపెట్టాలని చిరంజీవి, వి.వి.వినాయక్ భావించారు. కానీ ఇప్పుడు మరలా హీరోయిన్ ఎంపిక మొదటికి వచ్చేసరికి ఈ సినిమా షూటింగ్‌ను మొదట యాక్షన్ సీన్లతో ప్రారంభించి, ఆలోపు హీరోయిన్‌ని ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే వీరి చూపు బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనెపై పడింది. ఈ విషయం ఖరారు కావాల్సి వుంది. అందుకే మొదటగా హీరోయిన్‌తో సంబంధంలేని సన్నివేశాలను తీసి, ఆ తరువాత హీరోయిన్‌తో కలిసి చేసే సీన్లను చిత్రీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేర్పులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం విషయంలో మెగా ఫ్యామిలీతోపాటు వినాయక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.