అందరికీ నచ్చే ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ వింక్ ప్రొడక్షన్స్‌లో డైరెక్టర్ వినోద్ లింగాల తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’ వెండితెర మీదకు రావడానికి సిద్ధమైంది. సాయిరోనక్, అతిది సింగ్, ఐశ్వర్య.కె, నోయల్ నేని, నవీన్ నేని ప్రధాన తారాగణంగా నటించారు. ఈనెలో 17న విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘మంచి ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్‌మీద ఆదరణ ఉంటుంది. తాజాగా మా ‘గుప్పెడంత ప్రేమ’ కూడా అలాంటి ఉత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈనెల 17న మా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో మా యూనిట్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘సఖియా సఖియా’ అనే పాట సావన్ అనే మ్యూజిక్ ఆప్‌లో టాప్ ఐదు పాటల్లో 4వ ప్లేస్‌లో ఉండటంతోపాటు ఒక ప్రముఖ వార్తాపత్రిక ప్రచురించిన టాప్ 5 ఇండియన్ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఈ చిత్ర ఆడియో ఉండటం, వాటినుంచి మంచి రివ్యూలు రావడం విశేషం. షిల్లాంగ్, చిరపుంజి, మవ్లైనాంగ్, మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో మరియు ఉత్తర, తూర్పు భారతదేశంలోని అనేక లొకేషన్లలో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నుల పండుగగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో తొలిప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎంత బాగా ఉంటుందో, కొన్నిసార్లు బ్రేకప్ అయినప్పుడు కూడా ఆ గాయం అంతే గట్టిగా ఉంటుంది. కాకపోతే ఆ గాయం గుర్తుకొచ్చిన ప్రతిసారీ పెదాలపై చిరునవ్వు విరుస్తుంది. తొలి ప్రేమ గురించిన ఆ విషయాలను అంతే అందంగా తెరపై కవితాత్మకంగా చెప్పాం. యూనివర్సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. నేను ఇంతకుముందు ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలకు పనిచేశాను. దర్శకుడిగా నాకు ‘గుప్పెడంత ప్రేమ’ తొలి చిత్రం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

- యు