నవ్వుల విందుతో ఎంత పని చేసావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓవర్సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఎంతపని చేశావే శిరీషా’. శివరామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పట్లూరి బాలకృష్ణ, రామ్‌ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మాతలు. మహత్ రాఘవేంద్ర కథానాయకుడు. పునర్నవి భూపాలం కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జరిగింది. బ్యానర్ లోగోను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.రాంమోహన్ విడుదల చేశారు. టైటిల్ లోగోను అనిల్ సుంకర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అనిల్ సుంకర తీసిన ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్నారు. తమ యూనిట్ సభ్యులందరూ కృషిచేసి ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారని, ఇంటిల్లిపాది చూసేలా ఉంటుందని అన్నారు. ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ చిత్రం అన్ని వర్గాలకు నచ్చుతుందన్నారు. బాలకృష్ణ, తాను క్లాస్‌మేట్స్, బెంచ్‌మేట్స్ కాదని, ఈ సినిమా బ్యాక్‌బెంచ్ హీరో మహత్ రాఘవేంద్ర ఆ సినిమా చేశారని, వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రావడం ఆనందంగా వుందని తెలిపారు.