నరేష్ సరసన కృతిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత గ్యాప్ తీసుకున్న తరువాత అల్లరి నరేష్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారనున్నాడు. దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డితో భారీ చిత్రాన్ని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో ఓ చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ‘వినవయ్యా రామయ్యా’ కథానాయికగా నటించిన కృతికా జయకుమార్‌ని ఎంపిక చేశారు. కృతికా జయకుమార్ ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ కూతురిగా నటించిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లో వైవిధ్యంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ‘మా ఇంట్లో వుంది దెయ్యం నాకెందుకు భయం’ అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.