నేను.. శైలజ దర్శకుడితో.. నితిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నితిన్ తాజాగా నటించిన ‘అ ఆ’ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌పై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన అ ఆతో మరింత ఉత్సాహం తెచ్చుకున్న నితిన్, తదుపరి చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల కథకు ఓకె చెప్పాడని టాలీవుడ్ సమాచారం. కిషోర్ తిరుమలతో సినిమా చేయనున్నట్లు కొద్దికాలం క్రితమే నితిన్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా అన్నీ కుదరడంతో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ సొంత స్వంత శ్రేష్ఠమూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. ‘నేను శైలజ’ చిత్రంతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు కిషోర్, తన పంథాలోనే ఓ మంచి యూత్‌ఫుల్ రొమాంటిక్ స్టోరీని నితిన్ కోసం సిద్ధం చేశారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.