అమెజాన్ యోధులు వస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో ఫ్రాంకీచాన్ దర్శకత్వంలో జాకీచాన్ ఇండో ఓవర్సీస్ పతాకంపై రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘అమెజాన్ యోధులు’. 500 కోట్ల బడ్జెట్‌తో హైటెక్నికల్ విలువలతో రూపొందించిన ‘ది లెజండరీ అమెజాన్’ చిత్రాన్ని తెలుగులో సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ ‘అమెజాన్ యోధులు’ పేరుతో అనువదించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, భారీ సెట్టింగ్స్, భారీ విజువల్స్‌తో గ్రాండియర్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశామని, మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో ‘బాహుబలి’ని గుర్తుచేస్తాయని, తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు హైలెట్‌గా వుంటాయని ఆయన అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత:జి.వంశీకృష్ణ వర్మ, దర్శకత్వం:ప్రాంకిచాన్.