దండుపాళ్యం-2 షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండుపాళ్యం తెలుగు, కన్నడ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, మకరంద్ దేశ్‌పాండే, రవికాలె ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి భాగం దాదాపు 30 కోట్లు వసూలు చేసి చిన్న చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు. వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాస్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ‘దండుపాళ్యం-2’ చిత్రం తొలి భాగానికి సీక్వెల్‌గా చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, భారీ ఎత్తున రూపొందిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్‌పరంగా భారీ ఆఫర్లు వస్తున్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ‘బాహుబలి-2’, ‘రోబో-2’ వంటి సీక్వెల్స్ వస్తున్న సమయంలోనే తమ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కూడా రావడం సంతోషంగా వుందని అన్నారు. తెలుగు, కన్నడ భాషల్లో సెనే్సషన్ విజయంగా నిలిచిన దండుపాళ్యం చిత్రానికి సీక్వెల్ ప్రారంభంనుంచే మంచి క్రేజ్ వచ్చిందని, బెంగుళూరులవో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా వున్నాయని నిర్మాత వెంకట్ తెలిపారు. ఆగస్టులో రానున్న ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని, మొదటి చిత్రంలాగే ఈ సినిమాలో కూడా కథ కథనాలు రియలిస్టిక్‌గా వుంటాయని, సినిమా ప్రారంభం నుండి చివరివరకూ ప్రతి సీను గ్రిప్పింగ్‌గా వుంటుందని ఆయన అన్నారు.