ఉత్కంఠ రేపే అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ రూపొందించిన ‘అంతం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై బాపిరాజు ఈ సినిమాకు సంబంధించిన హక్కులను తీసుకున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ‘ఎ’ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రం ఈనెలాఖరుకు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటివరకూ రాని ఓ వెరైటీ కథనంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో అప్పుడే పెళ్లిచేసుకున్న అందమైన జంట జీవితంలోకి అనుకోని సంఘటనలు ఎదురైతే వారు ఏం చేశారు అనేదే ఈ సినిమా కథనమని తెలిపారు. ఈ సినిమా చూశాక రేష్మి నటన గూర్చి అందరూ మాట్లాడుకుంటారని, ఫస్ట్‌లుక్‌తోనే మంచి అంచనాలు వచ్చాయని ఆయన తెలిపారు. చరణ్‌దీప్, వాసుదేవ్, సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:కార్తీక్ రోడ్రిగ్జ్, కెమెరా, ఎడిటింగ్, డి.ఐ, వి.ఎఫ్.ఎక్స్, నిర్మాత, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్.

చిత్రం రేష్మి