సిద్ధమైన 4జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్, చంద్రకళ, సన్ని, సునంద ప్రధాన తారాగణంగా శ్రీ సాయి లక్ష్మీ మూవీస్ పతాకంపై శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో కె.వి.వినోద్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘4జి’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ కరణం మాట్లాడుతూ, బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందిందని, ప్రేమలో పడిన నలుగురు యువతులు ఆ ప్రేమతో ఎటువంటి సమస్యలు, కష్టాలు కొనితెచ్చుకున్నారు అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. సమాజంలో అనేకమంది యువతీ యువకుల జీవితాలకు దగ్గరగా ఈ కథనం వుంటుందని, వైజాగ్, అరకు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేశామని, త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎఫ్.ఎం బాబాయ్, సన, కరుణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సోమన్, సంగీతం:సుక్కు, ఎడిటింగ్:శ్రీగుహ, నిర్మాత:కె.వి.వినోద్‌రెడ్డి, దర్శకత్వం:శ్రీనివాస్ కరణం.