నటీమణుల కబడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో నటీమణుల కబడ్డీ నిర్వహిస్తున్నామని విక్రం ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు కె.విక్రమాదిత్య తెలిపారు. దాదాపు 35మంది నటీమణులతో తొలిసారిగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ఆలోచన కొత్తగా వుండడంతో టీవీ ఆర్టిస్టులు కూడా ఈ పోటీలో పాల్గొననున్నారని, జూలై నెలలో ఈ కార్యక్రమం జరుగుతుందని కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పోటీలలో తానూ పాల్గొనడం ఆనందంగా వుందని, మంచి పేర్లతో టీమ్‌లను తయారుచేస్తున్నామని, ఝాన్సీ లక్ష్మీభాయి, రాణీ రుద్రమదేవి, మాంచాల, రజియా సుల్తానా వంటి పేర్లు పరిశీలిస్తున్నామని నటి కవిత తెలిపారు. మహిళా నటీమణులందరూ కలిసి ఇలా కబడ్డీ ఆడటం జనరంజకంగా, ఆనందంగా వుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నటి శృతి తెలిపారు. కార్యక్రమంలో ప్రభాకర్, శ్రీవాణి, విక్రం, జ్యోతిరెడ్డి, నవీన, కృష్ణ తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.