సినిమా అంతా ఫ్లైఓవర్ మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను ఇప్పటివరకూ చేసిన కమర్షియల్ చిత్రాలలో ది బెస్ట్‌గా ‘ఒక్క అమ్మాయి తప్ప’ నిలుస్తుంది. దర్శకుడు ఈ కథను నాకు 2012లోనే చెప్పారు. నాకు నచ్చిన కథల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఒకటైతే, రెండోది ఇదే. కానీ ఇది సినిమాగా రూపొందించడం కష్టం. సినిమా అంతా హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై షూటింగ్ సాగాలి. ఆ కథను ప్రేక్షకులు నమ్మేలా తీయడానికి ఇంతకాలం పట్టింది’ అని కథానాయకుడు సందీప్‌కిషన్ తెలిపారు. నిత్యామీనన్, సందీప్‌కిషన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు చిత్ర విశేషాలను తెలియజేశారు..
మార్పులు లేవు
ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు ఏ కథ అయితే అనుకున్నామోవ అదే కథను వందశాతం వున్నది వున్నట్లుగా చిత్రీకరించాం. ఎటువంటి మార్పు చేయలేదు. మొదట బేగంపేట ఫ్లైఓవర్ అని అనుకున్నా, ఆ తరువాత హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌మీదే చిత్రీకరించాం.
పక్కా కమర్షియల్
సినిమా మొదటినుండి ఓ కొత్త పాయింట్‌తో కథ సాగుతూంటుంది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. పాటలు, ఫైట్స్ చాలా బావుంటాయి. పెద్ద స్కేల్‌లో సినిమా వుంటుంది. నిజానికి ఫ్లైఓవర్‌మీద 60 శాతం షూటింగ్ అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే అన్నపూర్ణ స్టూడియోలో సెట్‌వేసి షూటింగ్ చేశాం. వారం రోజులు మాత్రమే హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌మీద షూటింగ్ చేశాం. సినిమాలో ప్రధానంగా సిజి వర్క్ హైలెట్‌గా వుంటుంది. కానీ ఎక్కడా ప్రేక్షకుడు అది గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
హైట్ సమస్య లేదు
నిత్యామీనన్‌కు నాకూ హైట్ సమస్య ఎక్కడా రాలేదు. సరదాగా సెట్ అంతా ఒకరినొకరు సహకరించుకుంటూ షూటింగ్ చేశాం. తనకు ఈ కథ చాలా బాగా నచ్చింది. అందుకే నటించింది. దర్శకుడు చెప్పింది చెప్పినట్లుగా, తనకు నచ్చిన విధంగా నటించింది. లవ్‌సీన్లు రెండు మూడు యాడ్ చేసి కథ చెబితే, అది లేకుండానే వుంటేనే కథ బాగుంటుందని, అలాగే చేద్దామని చెప్పడంతో ఆ విధంగానే సినిమాను రూపొందించారు. అలా చెప్పి కన్విన్స్ చేసే గొప్పతనం ఆమెలో వుంది.
బెస్ట్ డైరెక్టర్
నేను ఇప్పటివరకు పనిచేసిన దర్శకులందరిలో రాజసింహ బెస్ట్ అని చెప్పగలను. సెట్స్‌లో తనకు ఏం కావాలో అతనికి తెలుసు. నటీనటులనుండి ఎంతవరకు రాబట్టుకోవాలో కూడా విజన్ వున్నవాడు. అందుకే అతనితో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది.
ట్రాఫిక్‌జామ్ ప్రేమ
ఓ పెద్ద నగరంలో ఫ్లైఓవర్ మధ్య జరిగే ఓ ప్రేమకథ ఇది. ఇద్దరు ప్రేమికులు ట్రాఫిక్‌జామ్‌నుండి దాటుకుంటూ తమ ప్రేమను ఎలా సాధించారు అన్న కథనమే సినిమాలో ప్రధానం. ట్రాఫిక్‌జామ్ అనేది సినిమాలో ఓ ప్రధానమైన సమస్య. ఫ్లైఓవర్‌మీద సుమారుగా సినిమా అంతా సాగుతుంది. భావోద్వేగాలన్నీ సహజంగా వుంటాయి. స్క్రీన్‌ప్లే సినిమాలో హైలెట్‌గా వుండి ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. అయితే, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుండేలా దర్శకుడు చిత్రీకరించారు.
నా పాత్ర
ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర ఓ కాలేజీ వదిలేసిన అబ్బాయి. చదువంటే అతనికి మొదటినుండి ఇష్టముండదు. తెలివి వున్నా కానీ దాన్ని ఉపయోగించడు. అయితే ఎదుటివ్యక్తులను బాగా అర్థం చేసుకోగలడు. ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉంటాడు. అలాంటి వ్యక్తికి నిత్యామీనన్‌లాంటి ప్రేమికురాలు దొరికితే ఎలా వుంటుంది?
అదొక కల
నేను పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో కృష్ణవంశీ లాంటి దర్శకుడితో పనిచేయాలని అనుకున్నాను. ఒకసారి ఆయనకు ఈ విషయాన్ని మెసేజ్ కూడా పెట్టాను. ఈరోజు అదే దర్శకుడితో సినిమా చేస్తుండడం చాలా సంతోషంగా వుంది. అదొక కలగా భావించాను. అది నేడు నిజమైంది.
తరువాతి సినిమాలు
కృష్ణవంశీతో ‘నక్షత్రం’, తమిళంలో ఓ సినిమాలో చేస్తున్నాను. పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై మరో తమిళ చిత్రంలో కూడా నటించనున్నాను. త్వరలో మిగతా విషయాలు తెలియజేస్తాను.

- యు