50 రోజులు దాటిన సరైనోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ రూపొందించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 50 రోజులు దాటింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ వేసవి కానుకగా విడుదల చేసిన ‘సరైనోడు’ అన్ని కేంద్రాల్లో అద్భుత విజయం సాధించిందని, అల్లు అర్జున్ మెచ్యుర్డ్‌గా ఈ సినిమాలో నటించాడని తెలిపారు. బోయపాటికి మాస్ పల్స్ బాగా తెలుసని, ఈ చిత్రంతో మరోసారి రుజువైందని, ఆడియో సినిమా విజయానికి ప్లస్ అయిందని అన్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్‌లు పోటాపోటీగా నటిస్తే బ్రహ్మానందం, విద్యుల్లేఖ రామన్ కామెడీ కుటుంబ ప్రేక్షకులకు నచ్చిందని తెలిపారు. 50 రోజులు పూర్తిచేసుకుని వంద రోజులకు దూసుకుపోతోందని ఆయన అన్నారు.