రాకేశ్‌శర్మ జీవితకథలో అమీర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో ప్రయోగానికి సిద్ధం అయ్యాడు? ఇంతకీ ఆయన చేసే ప్రయోగం ఏంటో తెలుసా? ఈసారి ఆయన ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవిత కథలో కనిపిస్తాడట! అవును, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా జరుగుతోంది. మొత్తానికి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది మొదటి స్పేస్ మూవీ అవుతుంది. రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు. 1984 ఏప్రిల్ 3న రష్యాకు చెందిన ‘సోయజ్ 11’ అనే రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఆయన జీవితం దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇప్పుడు ఆ కథతో అమీర్‌ఖాన్ ప్రయోగానికి సిద్ధం అవుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.