బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం : క్రిష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకు 99 సినిమాలు కథానాయకుడిగా పూర్తిచేసి 100 సినిమా మైలురాయిని దాటబోతున్న బాలకృష్ణ చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉన్నారని, విద్యార్థిలాగా షూటింగ్‌లో అన్నీ నేర్చుకుంటారని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లోని బసవరామ తారకం కేన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ తనయ బ్రహ్మణి అభిమానుల మధ్య జన్మదినోత్సవ కేక్‌ను కట్‌చేసి కేన్సర్ బాధితులైన చిన్నపిల్లలకు తినిపించారు. ఇంకా క్రిష్ మాట్లాడుతూ.. బాలయ్యకు 56 సంవత్సరాలు అంటే పెద్ద ప్రశ్నలా వుందని, సెట్‌లో అందరికంటే చిన్నపిల్లాడిలా ఆయనే ఉంటారని, 20 రోజులుగా షూటింగ్‌లో తమకొక మార్గదర్శిగా వ్యవహరించారని అన్నారు. ఆయన సినిమాలకంటే వ్యక్తిగతంగానే తనకు ఇష్టమని, పుట్టినరోజున కూడా ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలకోసం అమెరికా వెళ్లారని ఆయన అన్నారు. తన తండ్రికి వయసు పెరిగేకొద్దీ సినిమాల్లో నటించే శక్తికూడా పెరుగుతుందని, తన మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటారని, మానవ సేవే మాధవసేవ అనే మాటకోసం కేన్సర్ ఆస్పత్రిని నిర్మించి సేవలు అందిస్తున్నారని బాలకృష్ణ కూతురు బ్రహ్మణి అన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, చిత్రం యూనిట్ పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.

చిత్రం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఆయన కుమార్తె బ్రహ్మణి