ఆశలన్నీ ఆ సినిమాపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ ‘టెంపర్’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. ఈమధ్యనే విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలతో మళ్లీ సత్తా చాటాలనుకున్నా, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాల్లో కాజల్ నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి కితాబే దక్కినా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కాస్త నిరుత్సాహపడ్డారు. ఈనేపథ్యంలో విడుదల కానున్న ‘దో లఫ్జోంకి కహాని’ రిజల్ట్‌కోసం కాజల్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణదీప్, కాజల్ జంటగా నటించిన ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కాజల్ ఓ మెచ్యూర్డ్ రోల్‌లో అంధురాలిగా కనిపించనున్నారు. దీంతో నటనపరంగానూ ఈ సినిమా కాజల్‌కు స్పెషల్ అని చెప్పొచ్చు. పైగా లిప్ లాక్ కూడా చేసింది. ఇక ఈ వేసవిలో రెండు పెద్ద సినిమాలతో అందుకోలేకపోయిన హిట్, హిందీ సినిమాతో అయినా అందుకోవాలని ఆశిస్తోంది.