భారీ పారితోషికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేసినా క్రేజ్ పరంగా మాత్రం ఎక్కువే గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పరిణీతి చోప్రా. త్వరలోనే ఈమె సౌత్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మహేష్‌బాబు హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఓకె చెప్పిందట. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ సినిమా కోసం పరిణీతి తీసుకున్న రెమ్యూనరేషన్ అందరికీ షాక్ ఇస్తోంది. దక్షిణాదిలో ఇప్పటివరకూ ఎవరూ తీసుకోని మొత్తాన్ని ఆమె తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లు అయిన అనుష్క, కాజల్, తమన్నా లాంటివారు రెండు కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. కానీ పరిణీతి మాత్రం దానికి రెట్టింపుగా వసూలు చేయడానికి రెడీ అయిందట. ఇప్పటికే బాలీవుడ్‌లో హాట్ హాట్ ఫొటో షూట్‌లతో క్రేజ్ తెచ్చుకుంటున్న పరిణీతికి పారితోషికంతోపాటు ఖర్చులు కూడా అదనంగా వసూలు చేస్తోందట. మొత్తానికి సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తూ సంచలనమే సృష్టిస్తోంది.

చిత్రం పరిణీతి చోప్రా