నేడు అ ఆ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందించిన చిత్రం ‘అ ఆ’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక ఈనెల 12న గుంటూరులో జరపనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ, అన్ని కేంద్రాల్లో విజయఢంకా మ్రోగిస్తున్న ‘ఆ ఆ’ చిత్రం విజయాన్ని అందుకున్న సందర్భంగా ప్రేక్షకులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడానికి విజయోత్సవ వేడుకను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి ఘంటా శ్రీనివాసరావు అధ్యక్షులుగా వ్యవహరిస్తారని, గుంటూరులోని సిద్ధార్థా గార్డెన్స్‌లో ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో సినీ నటులు నితిన్, సమంత, అనుప, నదియ, నరేష్, రావు రమేష్, అజయ్, హరితేజ, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, మధునందన్‌తోపాటుగా పాటల రచయితలు రామజోగయ్య శాస్ర్తీ, కృష్ణచైతన్యలు, ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నామని అన్నారు.