త్వరలో 21 సెంచరీ లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా బి.ఆర్.ఎస్.ఐ పతాకంపై గోపీనాధ్ దర్శకత్వంలో పోల్కంపల్లి నరేందర్ రూపొందించిన చిత్రం ‘21 సెంచరీ లవ్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గోపీనాధ్ మాట్లాడుతూ, స్నేహమూ ప్రేమా ఆకర్షణలో పడి నేటి యువతరం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, పలువురికి ఈ చిత్రం చూపిస్తే అందరూ అభినందించారని, తొలి కాపీ సిద్ధమైందని అన్నారు. ‘గుంటూరు టాకీస్’ ద్వారా ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, నేటి యువతరానికి ఈ సినిమా వందశాతం నచ్చుతుందని తెలిపారు. ఎంటర్‌టైనింగ్ మూవీని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోమారు ఈ చిత్రం నిరూపించనుందని, దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించారని ఆర్.కె.స్టూడియో రాజ్‌కుమార్ తెలిపారు. పృధ్వీ, వేణు, సుమన్‌శెట్టి, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:కనిష్క, కెమెరా: బి.ఎల్.బాబు, ఎడిటింగ్:నాగబాబు, నిర్మాత:పోల్కంపల్లి నరేందర్, దర్శకత్వం:గోపీనాధ్.