యధార్థ సంఘటనలతో హ్యాపీ బర్త్‌డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథి, సంజన, శ్రవణ్ కీలక పాత్రల్లో పల్లెల వీరారెడ్డి (చె గువేరా) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ చిత్రాన్ని శ్రీనందన్ మూవీస్ పతాకంపై మహేష్ కల్లె నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి దర్శకుడు వీరారెడ్డి మాట్లాడుతూ- కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ ఇదని, ఒకే ఇంట్లో ఓ జంటకు ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రమని, రాత్రి 8 నుంచి 12గంటల మధ్య ఏం జరిగింది అనేది సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందించామని, ముఖ్యంగా ఇందులోని 15 నిమిషాల గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు. నిర్మాత మహేష్ మాట్లాడుతూ, హారర్ జోనర్‌లో సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ఇది. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చిందని, హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీకరించామని, అలాగే విదేశాల్లో కూడా చిత్రీకరణ జరిపామని అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో పాటలను విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా:వాసిరెడ్డి సత్యానంద్, సంగీతం:సంతోష్‌రెడ్డి, ఎడిటింగ్:మహేంద్రనాధ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:కోటేశ్వరరావు, నిర్మాత:మహేష్ కల్లె, దర్శకత్వం:పల్లెల వీరారెడ్డి.