దర్శకేంద్రుడి క్లాస్‌రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా ఉన్నాడు అంటే ఆ చిత్రం హిట్ అయినట్లే. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినట్లే. ఆయన కెరీర్‌లో అనేక హిట్స్ ఉన్నాయి. రాఘవేంద్రరావు మార్క్ అనేది ప్రతీ చిత్రంలో ఆయన చూపారు. అందుకే ఆయనను అభిమానులు దర్శకేంద్రుడు అని పిలుచుకుంటారు. దాదాపు 100 సినిమాలకుపైగా రూపొందించిన ఆయన తాజాగా సినీపాఠాలను చెప్పడానికి సిద్ధమయ్యారు. కమర్షియల్ చిత్రాలతోపాటు క్లాసికల్ చిత్రాలను రూపొందించిన ఆయన, తన 50 ఏళ్ళ సినీ అనుభవాలను పాఠాలుగా చెప్పనున్నారు. పాటల చిత్రీకరణలో తన మార్క్ ఎలా వుంటుందో, అదేవిధంగా ఈ పాఠాలు బోధించడంలో కూడా ఆయన కొత్త పంథాను ఎన్నుకున్నారు. సెట్‌లో దర్శకత్వం ఎలా చేయాలి, ఒక సీన్‌ను ఎలా చిత్రీకరించాలి అనే అంశాలతో ఆయన పాఠాలు చెప్పనున్నారు. త్వరలో దర్శకత్వ శాఖలోకి వెళ్లాలనుకునేవారికి ఈ ప పాఠాలు ఉపయుక్తం కానున్నాయి. నిర్దేశకత్వం పట్ల మక్కువ వున్న ఎవరైనా ఏ శిక్షణా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫీజు కట్టక్కర్లేదు. యూ ట్యూబ్‌లో కె.ఆర్.ఆర్. క్లాస్‌రూమ్ అనే వెబ్‌సైట్‌కు వెళితే చాలు. ఆయన పాఠాలు చెబుతారు. ఫిలిం మేకింగ్‌లో మెళకువలు నేర్పిస్తారు. ప్రతి పదిరోజులకొకసారి ఒక్కోపాఠం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.