తొలి చిత్రానికే మంచి కథ దొరికింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ కుటుంబం నుండి ఓ హీరోయిన్ తెరంగేట్రం చేస్తోంది. ఆమెకోసం అందరూ ఆశ్చర్యంగానే ఎదురుచూస్తున్నారు. దాదాపుగా హీరోల కుటుంబాలనుండి హీరోయిన్లు వచ్చిన విషయం అరుదైనదే. ఇప్పుడు నాగబాబు కుమార్తె ‘ఒక మనసు’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేస్తున్నారు. మొదటిసారిగా మెగా ఫ్యామిలీనుండి వస్తున్న నటిగా అభిమానులకు వున్న అపోహలు, అనుమానాలు తొలగించడానికి శనివారం ఉదయం ఆమె చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో వివిధ జిల్లాలనుండి వచ్చిన 200లకుపైగా మహిళా అభిమానులను కలుసుకొని వారి ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఆమె చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే విందాం... ‘నానుండి వచ్చే ఏ సినిమా అయినా సరే అభిమానులకుగాని, తన కుటుంబానికిగాని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటా. మెగా వారసులను ప్రేక్షకులు దీవించినట్లుగా నన్నుకూడా ఆదరిస్తారన్న నమ్మకంతో వున్నా. ఈ చిత్రం గూర్చి చెప్పాలంటే, ప్రతిఒక్కరు తమను తాము ఈ కథలో చూసుకొనేలా ఉంటుంది. నా మొదటి చిత్రానికే ఇంతమంచి కథ దొరకడం ఆనందంగా వుందన్నా రు. ఆడపిల్లలు ప్రేమ విషయంలో ఎలా ఆలోచిస్తారనే విషయంలో ఈ సినిమా చూశాక మార్పు వస్తుంది. కుటుంబం అంతా కలిసి చూడగలిగేలా దర్శకుడు తీర్చిదిద్దారు. వెనె్నల కిషోర్ కామెడీ హైలెట్‌గా నిలిచే ఈ సినిమా పాటలకు ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఈనెల 24న మంచి మనసుతో మనందరం థియేటర్‌లో కలుద్దాం’ అని ఆమె ముగించారు.

చిత్రం నిహారిక