వైజాగ్‌లో రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాల గురించి నిర్మాతలు తెలియజేశారు.‘మొదటి షెడ్యూల్ పూర్తయింది. జూన్ 14నుండి 30వరకు వైజాగ్‌లో రెండో షెడ్యూల్‌ను జరపనున్నాం. రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘కందిరీగ’ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 14 రీల్స్ బ్యానర్‌లో ఇది నాలుగవ చిత్రం. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, ఆర్ట్: అవినాష్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.