నాగార్జునతో విమలారామన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భక్తిరస చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘ఓం నమో వేంకటేశాయ’ టైటిల్‌ను నిర్ణయించారు. వేంకటేశ్వరస్వామి పరమభక్తుడైన హాథీరామ్‌బాబా జీవిత కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, ప్రజ్ఞాజైస్వాల్‌లు ఎంపికయ్యారు. తాజాగా మరో హీరోయిన్ ఫైనల్ అయ్యిందట. ఆమె ఎవరో కాదు. ‘గాయం-2’, ‘రంగా ది దొంగ’ వంటి చిత్రాల్లో నటించిన విమలారామన్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విమలారామన్ వేంకటేశ్వరస్వామి భార్యల్లో ఒకరైన శ్రీదేవి పాత్రలో కనిపిస్తుందని తెలిసింది. ఇందులో వేంకటేశ్వరస్వామిగా పలు హిందీ సీరియల్స్‌లో కృష్ణుడిగా నటించిన సురబ్‌రాజ్‌జైన్ నటిస్తాడని అంటున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చిన ఈ చిత్రం ఈనెల చివరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.