నాని నిజంగానే జెంటిల్‌మేన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సురభి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెంటిల్‌మన్’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
కథ నచ్చింది
ఈ కథను ఐదేళ్ల క్రితమే విన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. డేవిడ్ మథోస్ అనే దర్శకుడు చెప్పిన కథ ఇది. కథ విన్న తర్వాత దీన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ అయితే బాగా డీల్ చేస్తాడని, ఆయనకు చెప్పాను. కానీ తను నా సొంత కథతో చేస్తానని చెప్పాడు. అయినాసరే ముందు ఈ కథ విని, నచ్చితే ఓకే లేదంటే ఆ కథతో చేద్దామన్నాను. కథ విన్న మోహనకృష్ణ కూడా ఎగ్జైట్ అయ్యాడు.
* నానికి సరిపోయింది
కథ విన్న తర్వాత ఈ పాత్రకు నాని అయితే కరెక్ట్ అని తనకు చెప్పాం. నానికి కూడా కథ బాగా నచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ హీరోలు భిన్నంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు నాని. అప్పట్లో కమల్‌హాసన్ కూడా అలాగే విభిన్నమైన సినిమాలు చేశాడు. జెంటిల్‌మన్ సినిమా నానీకి మరో కొత్త ఇమేజ్‌నిస్తుంది.
* థ్రిల్ అవుతారు
కథ చాలా కొత్తగా వుంటుంది. ప్రతి సెకను ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్ అయ్యేలా వుంటుంది. దర్శకుడు మోహనకృష్ణ అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూసుకున్న తర్వాత చాలా సంతృప్తి కలిగింది. నేటి ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. కచ్చితంగా అలాంటి వారికి సంతృప్తినిచ్చే సినిమా ఇది.
* గ్యాప్ అందుకే
బాలకృష్ణతో చేసిన ‘మిత్రుడు’ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడం, ఇప్పుడున్న పరిస్థితులను జీర్ణించుకోవడానికి సమయం పట్టింది.
* అలా నిర్మాతనయ్యా
నేను నటుడు చంద్రమోహన్ మేనల్లుణ్ణి. 1977లో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత జాబ్‌కోసం చంద్రమోహన్ దగ్గరకు వచ్చాను. అప్పుడే ఆయన ‘సిరిసిరిమువ్వ’, ‘సీతామాలక్ష్మి’ సినిమాల విజయంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. తన దగ్గరే ఉండి నాకు సంబంధించిన డేట్స్, లావాదేవీలు చూసుకోమని చెప్పడంతో ఆయనతో ఉండిపోయాను. ఆ తర్వాత మిత్రుడు ‘రాకాశినాగు’ అనే డబ్బింగ్ సినిమా చేశాడు. దాన్ని నేను నెల్లూరుకు డిస్ట్రిబ్యూటర్‌గా చేశాను. ఆ సినిమా పెద్ద విజయం సాధించడంతో నాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత రేలంగి దర్శకత్వంలో చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ సినిమాతో నిర్మాతనయ్యా. ఆ తర్వాత ‘వంశానికొక్కడు’, ‘్భలేవాడివి బాసు’, ‘ఆదిత్య-369’ వంటి చిత్రాలు తీశా.
* తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ఈ సినిమా విడుదలకోసం ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా తర్వాత తప్పకుండా మరిన్ని సినిమాలు తీస్తా.

- శ్రీ