మహానటులకు ‘పద్మశ్రీ’ ఇవ్వకపోవడం దౌర్భాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో మహానటులున్నా వారికి పద్మశ్రీవంటి పురస్కారాలు రాకపోవడం తెలుగువారి దౌర్భాగ్యమని, ప్రతిభను గుర్తించని ప్రభుత్వాలు రికమెండేషన్లను గుర్తించి ముక్కూముఖం తెలియనివారికి ఆ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాయని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలవల్ల ఆ పురస్కారం చిన్నబోతోందని అన్నారు. ప్రముఖ సినీ నటులు జమున, కైకాల సత్యనారాయణలను ఆదివారం హైదరాబాద్‌లో ‘మా’ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, రాజేంద్రప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్, మంచు విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడారు. ‘మద్రాస్‌లో ఆర్టిస్ట్‌ల సంఘం మొదలైనా, హైదరాబాద్‌లో అది ‘మా’ అసోసియేషన్‌గా అవతరించింది. సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి సమక్షంలో దీనికి అంకురార్పణ జరిగింది. ఇప్పటివరకు ఎన్నో సంఘాలు వచ్చి వెళ్లాయి కానీ, అన్నింటిలో నేటి అసోసియేషన్ పనితీరు బాగుంది. కోటీశ్వరులైన ఆర్టిస్టులు, పేదలైన ఆర్టిస్టులు ఉన్నారు. పేద కళాకారుల్లో కొందరి చిరునామాలు కూడా తెలియదు. అలాంటి వారిని గుర్తించి, ఆదుకోవాలని మా గత అధ్యక్షుడు మురళీమోహన్‌ను కోరాను. నిర్మాతల మండలికి 14 కోట్ల నిధి ఏర్పాటు చేసి, అందరికీ హెల్త్‌కార్డులు, ఇన్సూరెన్స్ లాంటివి ఏర్పాటు చేశాం. అదే తరహాలో నటీనటులకు కూడా చేయాలని కోరుతున్నాం. కాకతాళీయమే అయినా కైకాలకు తొలి అవకాశం ఇచ్చిన సీనియర్ నటి జమున సహా ఇలా సన్మానించడం బాగుంది. ‘సత్యభామ’గా జమున ఎంతో మెప్పించారు. నా 150 సినిమాల్లో 75 సినిమాల్లో కైకాల నటించారు. ఆయనకెంతో డెడికేషన్ ఉంది. అంజలీదేవి, సావిత్రి, ఎస్.వి.ఆర్, జమున, కైకాల వంటి సీనియర్ నటులకు పద్మశ్రీలు లేవంటే అది మనందరి దౌర్భాగ్యం. మన ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించవు. రికమెండేషన్‌లే గుర్తిస్తాయి. ఇదో దరిద్రం. ఎవరో ముక్కుమొహం తెలియని వారికి పద్మశ్రీలు ఇస్తున్నారు. అందువల్ల వాటి విలువ పడిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జమున మాట్లాడుతూ.. 50 ఏళ్ల నట జీవితంలో ఎన్నో గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు చూశానని, కానీ ‘మా’ కుటుంబ సభ్యుల మధ్య సన్మానం గొప్ప సంతోషాన్నిస్తోందని అన్నారు. కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ, రాజేంద్రప్రసాద్, శివాజీరాజాల కమిటీ మంచి ఆలోచన చేసిందని, ఎన్నో సన్మానాలు, కనకాభిషేకాలు జరిగినా ఇంట గెలిచి, రచ్చగెలవాలన్నట్టు ‘మా’ సన్మానం గొప్ప ఆనందాన్నిచ్చింది అన్నారు.