ఆకట్టుకున్న రెండక్షరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రెండక్షరాలు’ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, రెండు జంటలమీద సాగే ఈ చిత్రం సందేశాత్మకంగా వుంటుందని నిర్మాత పైలా దేవదాస్‌రెడ్డి తెలిపారు. శ్రీ కంచమ్మతల్లి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం. దర్శకత్వంలో ఆయన రూపొందించిన రెండక్షరాలు గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో పాజిటివ్ టాక్‌తో సాగుతోందని వివరిస్తూ, 10న తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేసిన ఈ చిత్రం తొలి సగం కామెడీగా, మలిసగం భావోద్వేగాలతో సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, అన్ని కేంద్రాలనుండి మంచి టాక్ వస్తుండడం ఆనందాన్నిస్తోందని తెలిపారు. ఇప్పటివరకూ ఎవరూ షూటింగ్ చేయని ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించామని, నేటి యువత తల్లిదండ్రుల అనుమతిలేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ, ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలకు బలైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, ‘జబర్దస్త్ టీమ్’ కామెడీ అలరిస్తోందని అన్నారు. ఈ వారం నుండి థియేటర్లను పెంచుతున్నామని అన్నారు.