సన్యాసినిగా అనుష్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ అనుష్క ప్రస్తుతం ‘బాహుబలి-2’, ‘సింగం-3’ చిత్రాల్లో నటిస్తోంది. దానితోపాటు భాగమతి అనే చిత్రం కూడా చేస్తోంది. ప్రస్తుతం అనుష్క సన్యాసినిగా ఓ సినిమా కోసం మారనున్నదట. నాగార్జున కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో అనుష్క సన్యాసినిగా నటించనుందని సమాచారం. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా వున్నారు. విమలా రామన్, ప్రజ్ఞాజైస్వాల్ కూడా అనుష్కతోపాటుగా నటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెలాఖరుకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ అటు గ్లామర్, ఇటు రౌద్ర పాత్రలతో మెప్పించిన అనుష్క, సన్యాసినిగా ఎలా నటిస్తుందో వేచి చూడాల్సిందే!