బూతు లేని కామెడీ ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సున్నితంగా వుండే వినోదం అంటే నాకు చాలా ఇష్టం. కులమతాలపై, వికలాంగులమీద జోకులు వేయకుండా, బూతులు లేని కామెడీ ఇవ్వడానికి మొదటినుండీ నేను ప్రయత్నిస్తున్నాను. అందుకోసమే నేను కష్టపడాల్సి వస్తుంది. మొదటినుండి నా ప్రయాణం అలానే సాగింది’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూపొందించిన ‘అ ఆ’ చిత్రం గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడం అనేది చిన్నమాట అని, ఈ కథను బలంగా చెప్పాలి, ఎక్కువ మలుపులు, రక్తపాతాలు ఉండకూడదనుకున్నానని, అంతకంటే ముందు మధ్యతరగతి వ్యక్తిని గనుక వీటన్నింటికంటే మనిషే ముఖ్యమని, అతని ఆలోచనలు గొప్పవైతే గొప్పమనిషిగా ఎదుగుతాడన్న నమ్మకంతోనే ఇలాంటి కథలతో చిత్రాలు తీస్తున్నానని అన్నారు. బూతు మాట్లాడితే ప్రేక్షకులు నవ్వుతారు కానీ, తక్కువగా చూస్తారని, అందుకే ఆలస్యంగా వచ్చినా మంచి సినిమాతో రావాలనుకున్నానని తెలిపారు. బిరియానీ, మసాలాలు తిని ఫుడ్ పాయిజన్‌కు గురైతే డాక్టర్ చారన్నం తినమంటాడని, నా దృష్టిలో ఈ సినిమా చారన్నం లాంటిదని ఆయన అన్నారు. ఎక్కువ పులుపు, తీపి, ఉప్పు లేకుండా వుండదని, ఏ తప్పూ చేయకుండా మనిషి బ్రతకడం తేలిక కాదుకనుక, మామూలుగా బతికినవాళ్లే మహానుభావులని ఆయన వివరించారు. చాలాకాలం తరువాత తాను సైతం చిత్రం తరువాత గుంటూరుకు వచ్చానని, ‘అ ఆ’ సినిమాను ఇంత విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని నటుడు నితిన్ అన్నారు. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టుకు మంచి పేరు వచ్చిందని, అలా రావడానికి ఆ పాత్రలను సృష్టించిన త్రివిక్రమే కారణమని తెలిపారు. మిక్కి సంగీతం, నట్టి కెమెరా పనితనం సినిమా విజయానికి ప్లస్ అయ్యాయని, తన కెరీర్‌లో ఈ విజయం టర్నింగ్ పాయింట్ లాంటిదని ఆయన అన్నారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించినందుకు సంతోషంగా వుందని కథానాయిక అనుపమా పరమేశ్వరన్ అన్నారు. కార్యక్రమంలో నటి నదియా, శ్రీనివాసరెడ్డి, హరితేజ, పమీ సాయి, మధునందన్, కృష్ణచైతన్య, రాజు తదితరులు పాల్గొన్నారు.