చిలుకూరు బాలాజీపై సినిమా భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిమ్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సాయికుమార్, సుమన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రధాన తారాగణంగా అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిలుకూరు బాలాజీ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి శంషాబాద్‌వద్దగల శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన జీయర్‌స్వామి మాట్లాడుతూ ప్రతి ఊరిలో ఉండే దేవాలయం ఓ కేంద్రమైతే ఆ దేవాలయంతో అనుసంధానమైన ప్రతి ఒక్కరు దేవునికి దగ్గరగానే ఉంటారని, సర్వాంతర్యామి అయిన ఆయనకు ప్రాంతాలంటూ ఏమీ లేవని అన్నారు. ఆలయ విధి విధానాలకు నిర్దిష్టమైన నియమాలు చెప్పిన రామానుజాచార్యులవారి జీవితం వెడలిపోయిన వెయ్యవ సంవత్సరం ఇదని, ఈ దివ్య సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పురాణం గురించి సినిమా తీసి, విడుదల చేస్తున్న దర్శకులు అభినందనీయులని ఆయన అన్నారు. మానవీయ కోణంకోసం అల్లాణి శ్రీ్ధర్ ఈ చిత్రాన్ని రూపొందించారని, వీసాల దేవుడిగా కీర్తింపబడుతున్న చిలుకూరు బాలాజీ ఆడియో ఓ పవిత్ర స్థలంలో విడుదల చేయడం ఆనంద దాయకమని, మంచి పాటలతో భక్త్భివనతో ఉన్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని తెలంగాణా ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు. చిలుకూరు కోవెల స్థల పురాణం గోలుకొండ కోటకంటే పురాతనమైనదని, మాధవరెడ్డి అనే భక్తుడికి కలలో కనిపించి నేను పలానా పుట్టలో ఉన్నాను అని చెబితే పాలతో అభిషేకం చేసినప్పుడు వెంకటేశ్వరుడు అవతరించాడని, ఈ స్థల పురాణాన్ని కథగా మలచుకొని చిత్రాన్ని రూపొందించిన దర్శకులు అభినందనీయులని చిలుకూరు బాలాజీ కోవెల ప్రధానార్చకులు డా.సి.రంగరాజన్ అన్నారు. నేటి యువతరం భక్తిశ్రద్ధలతో ఉన్నారని, వీసాల దేవుడిగా కీర్తింపబడుతున్న బాలాజీ చిత్రాన్ని చాలా కష్టపడి రూపొందించామని ఈ ఆడియోను చిన జీయర్‌స్వామి చెంత విడుదల చేయడం మరింత ఆనందదాయకమని దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ అన్నారు. కార్యక్రమంలో సానా యాదిరెడ్డి, సంగీత దర్శకుడు అర్జున్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కాపర్తి వీరేంద్ర తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.