సెల్ఫీరాజా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్, సాక్షీ చౌదరి, కామ్నా రణావత్ హీరో హీరోయిన్లుగా జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో గోపీ ఆర్ట్స్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కుతున్న చిత్రం ‘సెల్ఫీరాజా’. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్‌కి ఈమధ్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతుండడంతో ఆయన సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే బందిపోటు, జేమ్స్‌బాండ్, మామ మంచు అల్లుడు కంచు సినిమాల తరువాత అల్లరి నరేష్ నటిస్తోన్న సెల్ఫీరాజా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌కు సెల్ఫీలు తీసుకోవడం అంటే పిచ్చి వున్న పాత్రలో కనిపిస్తాడట. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ గబ్బర్‌సింగ్, అల్లు అర్జున్ సరైనోడు సినిమాల స్పూఫ్‌లతో అలరించడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే పాటలను విడుదలచేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.