ఉపేంద్ర బ్రాహ్మణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండుపాళ్యం సినిమాతో కన్నడ, తెలుగు ప్రేక్షకులలో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనివాసరాజు ప్రస్తుతం దండుపాళ్యం-2 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు ముందు ఆయన ఉపేంద్ర హీరోగా శివం పేరుతో కన్నడంలో రూపొందించిన చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బ్రాహ్మణ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాతలు విజయ్ ఎం, గుర్రం మహేష్ చౌదరి, సి.ఆర్.మనోహర్ సమర్పణలో వి.జి.చరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ.. ఉపేంద్ర సరసన సలోని, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం మంచి విజయం సాధించింది. కన్నడంలో ఉపేంద్ర కెరీర్‌లో మంచి సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులో బ్రాహ్మణ పేరుతో విడుదల చేస్తున్నాం. ఉపేంద్రకు ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈనెల 16న విడుదల చేసి, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, ఎడిటింగ్: వినోద్ మనోహర్, సంగీతం: మణిశర్మ