కలగన్నా...నటినయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుప్పెడంత మనసు హీరోయిన్ అతిథి సింగ్
సాయిరోనక్, అతిథి సింగ్ జంటగా వినోద్ లింగాల దర్శకత్వంలో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ‘గుప్పెడంత మనసు’ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది అతిథి సింగ్. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు..
హీరోయిన్ కల
చిన్నప్పటినుంచీ హీరోయిన్ అవ్వాలని, బిగ్ స్క్రీన్‌మీద నన్ను నేను చూసుకోవాలనే కోరిక బలంగా వుండేది. స్కూల్లో టీచర్లు అడిగినప్పుడు కూడా హీరోయిన్ అవుతానని చెప్పాను. పుట్టింది దిల్లీలో అయితే పెరిగిందంతా ముంబాయిలోనే. మా నాన్న ప్రతాప్‌సింగ్. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించారు. బహుశా నటిగా మారడానికి ఆయన ప్రభావం నాపై ఉందేమో.
తొలి అవకాశం
నా ఫొటోలు చూసి డైరెక్టర్ వినోద్ రమ్మన్నారు. ఈ సినిమా కోసం బరువు తగ్గాల్సి వుంటుందని చెప్పారు. దాంతో నేను నెలరోజుల్లో పది కిలోల బరువు తగ్గాను. ఈ సినిమా కోసం ఆడిషన్‌లో పాల్గొన్నాను. అలా ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఇందులో నా పాత్ర పేరు శాండి. తెలుగు సంప్రదాయాలు, విలువలను గౌరవించే అమ్మాయిగా వుంటాను. ముఖ్యంగా తొలిప్రేమలోని స్వచ్ఛమైన ఫీలింగ్స్‌తో నడిచే కథ ఇది. ఒక మామూలు అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి ఎంటరైతే ఏం జరిగిందనేదే ఈ కథ.
డబ్బింగ్ చెబుతా
ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పలేదు కానీ తప్పకుండా ముందు ముందు చిత్రాల్లో చెబుతా. అలాగే పాటలు కూడా పాడాలని వుంది. ఈ సినిమా విషయంలో వినోద్ ఎంతో సపోర్టు అందించారు. అలాగే సాయి రోనక్‌తో మంచి స్నేహం ఏర్పడింది. లొకేషన్‌లో మేం ఇద్దరం తెగ అల్లరి చేసేవాళ్లం. అలాగే స్క్రీన్‌పై కూడా మా ఇద్దరిమధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. మేఘాలయ, చిరపుంజి లాంటి ప్రాంతాల్లో జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలో షూటింగ్ చేయడం ఎగ్జైటింగ్‌గా వుంది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరుతుంది. ప్రస్తుతానికి ఏ సినిమా కమిట్ అవ్వలేదు. భవిష్యత్తులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి.

-యు