హీరోనా... విలనా అనేది సస్పెన్ స్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని.. అచ్చంగా మన పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్రల్లో నటిస్తూ సహజత్వానికి దగ్గరగా, హీరోయిజానికి దూరంగా తన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. సినిమా సినిమాకూ విభిన్నతను ప్రదర్శిస్తూ సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఇటు కమర్షియల్ సినిమాలతో అలరిస్తున్నాడు. నాని తాజాగా నటిస్తున్న చిత్రం ‘జెంటిల్‌మన్’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై
తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలవుతున్న సందర్భంగా నానితో ఇంటర్వ్యూ...
* ఇందులో మీరు హీరోనా, విలనా?
- చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నేను విలనా హీరోనా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే చాలామంది డ్యూయల్ రోల్ చేస్తున్నారా? అంటున్నారు. ఏదైనా సరే విడుదల తరువాత మీకే తెలుస్తుంది.
* ఏం నచ్చి కథ ఓకే చేశారు?
- నేను ఏ కథ విన్నా ఒక ప్రేక్షకుడిగానే వింటాను తప్ప హీరోగా వినను. ప్రతి కథ విన్నప్పుడు నేను సత్యం థియేటర్‌లో కూర్చుని సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే, సత్యం థియేటర్‌లో సినిమాలు చూసి పెరిగినవాణ్ణి. ఈ కథలో ముఖ్యంగా ఒక పాత్రకు సంబంధించి ఇలాకూడా చేయొచ్చు అనే విధంగా ఉంటుంది. అలాగే, ఆ పాత్ర ఆలోచనా విధానం కూడా భిన్నంగా వుంటుంది. అందుకే ఈ కథ ఒప్పుకున్నా.
* అంతగా ప్రభావితం చేసిన అంశం ఏమిటి?
- నిజంగా ఇలాంటి పాత్రలు తక్కువ వుంటాయి. నటుడిగా ఇది ఓ పెద్ద ఛాలెంజ్ లాంటిదే. మామూలుగా చాలా చిత్రాల్లో నటిస్తుంటాం కానీ ఇలాంటి ఎడ్జ్‌లో వున్న పాత్రను చేయడం కష్టమే.
* కమర్షియల్ సక్సెస్‌తో వున్న మీరు ఇలాంటి
భిన్నమైన సినిమాలు చేయడం రిస్క్ కాదా?
- ఇది రిస్క్ అని నేననను. నటుడు అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేయగలగాలి. ఎంతసేపూ కమర్షియల్ సినిమాలు చేస్తాం చెప్పండి! ఇందులో నేను జై అనే ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఓనర్‌గా కన్పిస్తాను. లవ్‌స్టోరీ, ఎంటర్‌టైన్‌మెంట్ వుంటూనే మరో థ్రిల్లింగ్ కలిగించే షేడ్ కూడా వుంటుంది.
* ‘అష్టాచమ్మా’ తరువాత ఇప్పుడు
ఈ సినిమా చేస్తే ఎలా వుంది?
- నిజంగా ‘అష్టాచమ్మా’ సినిమా సమయంలో ఏమీ తెలిసేది కాదు. అసలు నన్ను వీళ్లు హీరోగా పెట్టుకుని సినిమా తీయడం ఏంటి అని అనుకునేవాణ్ణి. కానీ ఇన్ని సినిమాలు చేసిన తరువాత పర్లేదు, ప్రేక్షకులు నన్ను హీరోగా అంగీకరించారనే నమ్మకం కలిగింది. ఇక ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకూ మోహనకృష్ణతో మా రిలేషన్ ఇంకా బలపడింది. అలాగే తను మంచి డైరెక్టర్‌గా ఎదిగాడు.
* అవసరాల శ్రీనివాస్‌తో మీ కాంబినేషన్?
- అవసరాల శ్రీనివాస్‌తో కలిసి ఇది నాలుగో సినిమా. మేం కలసి చేసిన సినిమాలన్నీ మంచి హిట్లు అయ్యాయి. ఇందులో తనది మంచి పాత్ర. ముఖ్యంగా అతనిలో నటుడిగా గొప్ప క్వాలిటీస్ వున్నాయి. సాధారణంగా ఇలాంటి నటులు అరుదుగా కన్పిస్తుంటారు. అలాగే తను నాకు మంచి ఫ్రెండ్ కూడా.
* నిర్మాత కృష్ణప్రసాద్ గురించి?
- ఈ సినిమా విషయంలో కృష్ణప్రసాద్ నన్ను కలిశారు. మాట్లాడుతూ ఆయన ఆదిత్య 369 సినిమా చేశానని చెప్పగానే షాక్ అయ్యాను. ఆ రోజుల్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలోనే అలాంటి గొప్ప ప్రయోగాత్మక సినిమా చేయడం సాహసమే. ఆ విషయం చెప్పిన తరువాత ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపించా.
* హీరోయిన్స్‌తో మీ కాంబినేషన్?
- సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరూ వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఒక సినిమాలో ఒక్క హీరోయిన్ వుంటేనే ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత వుండదు, కానీ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, వారికిదగ్గ పాత్రలు వుంటాయి. ఏదో గ్లామర్ కోసం పెట్టింది మాత్రం కాదు.
* హీరో అయ్యుండి సింపుల్‌గానే వుంటారు, కారణం?
- చాలామంది అంటుంటారు- హీరోలా కాకుండా సింపుల్‌గా వుంటావు, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్ వేసుకోవు అని. నిజానికి నాకు సింపుల్‌గానే వుండడం ఇష్టం. సినిమాల్లో పాత్రలు బట్టి డ్రెస్సింగ్ వేసుకోవాలనేది నా ఆలోచన. ఉదాహరణకు ‘్భమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో పాత్రకు తగ్గట్టుగానే నా స్టైలింగ్ వుంటుంది. అలా కాకుండా సూట్లు, కోట్లు అని హంగామా చేస్తే పాత్ర దెబ్బతింటుంది కదా!
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం విరించి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. పక్కా లవ్‌స్టోరీతో తెరకెక్కే సినిమా ఇది. దీని తరువాత దిల్‌రాజు బ్యానర్‌లో త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. అలాగే అవసరాల శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమా చేస్తా.

-శ్రీ