నయన మళ్లీ భయపెడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నయనతార ఇప్పటికే మాయ చిత్రంతో హర్రర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె హర్రర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ వద్ద సహాయకుడిగా పనిచేసే రామస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని సుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా రూపొందే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ఆయన తెలియజేస్తూ నయనతార నటిస్తున్న మరో హర్రర్ చిత్రమిది. ఇప్పటివరకూ వచ్చిన హర్రర్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా నయనతార పాత్ర ఆసక్తికరంగా వుంటుంది. ఉత్కంఠతను కలిగించే అంశాలతో తెరకెక్కే ఈ చిత్రం చూసే ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది. ఈనెల 18నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మా బ్యానర్‌లో భిన్నమైన సినిమాలు రూపొందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.