శివగామి ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘శివగామి’. ఈ చిత్రాన్ని తెలుగులో తుమ్మలపల్లి రామసత్యనారాయణ భీమవరం టాకీస్‌పై అందిస్తున్నారు. మనీష్ ఆర్యా, ప్రియాంకారావు, బేబి హాసిని ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు రమేష్ జైన్, దర్శకుడు సుమంత్ మాట్లాడుతూ, గుజరాత్‌లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, బేబి సుహాసిని, సీనియర్ సుహాసినిల నటన ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందని, గజల్ శ్రీనివాస్ కుమార్తె సంస్కృతి ఈ చిత్రంలో శివగామిగా పాడిందని తెలిపారు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ చిత్రం హారర్ చిత్రాలలో ఓ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో రసమయి బాలకృష్ణ, అల్లాణి శ్రీ్ధర్, గజల్ శ్రీనివాస్, రామకృష్ణగౌడ్, కవిత, పద్మిని, వెంకట్‌రావు తదితరులు పాల్గొని సినిమా విశేషాలను తెలిపారు. జై జగదీష్, కల్పన, రాధ, సుహాసిని మణిరత్నం నటించిన ఈ చిత్రానికి కెమెరా:సురేష్, సంగీతం:త్యాగరాజ్, నిర్మాత:తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సుమంత్.