రూమర్లు ఎప్పుడూ ఉండేవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజ జీవితానికి దగ్గరగా..
ఈ సినిమాలో నేను సూర్య అనే పాత్రలో నటించాను. నా నిజ జీవితానికి దగ్గరగా వుండే పాత్ర ఇది. అప్‌కమింగ్ పొలిటీషియన్ ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొంటాడు అనే విషయాలు ఈ సినిమాలో చర్చించారు. రాజకీయ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. డైరెక్టర్‌కు ఈ సినిమా కథపై పూర్తి క్లారిటీ వుంది. సెన్సార్ పూర్తిచేసుకుని సింగిల్ కట్ లేకుండా ‘యు’ సర్ట్ఫికెట్ పొందింది.
నిహారిక చాలా ఫ్రెండ్లీ
ఈ చిత్రంలో నిహారికతో పనిచేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా వుంది. మొదట చాలా భయపడ్డాను. పెద్ద కుటుంబం నుండి వచ్చిన హీరోయిన్ కదా, నన్ను సరిగా రిసీవ్ చేసుకుంటుందో లేదో అనుకున్నాను. కానీ, ఆమె చాలా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో షూటింగ్ చేయడం చాలా సులభమైంది. ఆమెతో నేను డేటింగ్ చేస్తున్నాననే వార్తలు కూడా వినిపించాయి. అవి కేవలం రూమర్లు మాత్రమే. నేను ఏ హీరోయిన్‌తో నటించినా ఆమెతో డేటింగ్ చేస్తున్నాననే రాసేస్తున్నారు.
వారితో బోర్ కొట్టింది
ఈమధ్య ఎక్కువగా రాశీఖాన్నా, సోనారికలు కథానాయికలుగా చిత్రాల్లో నటించాను. వారితో నటించి బోర్ కొట్టినట్లయింది. వారితో సినిమా చేసినప్పుడు కూడా గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడేమో నిహారిక అంటున్నారు. నిజానికి నాకు అనుష్క అంటే చాలా ఇష్టమని అనేకసార్లు చెప్పాను. మరి తనతో ఎఫైర్ వుందని ఎందుకు వ్రాయరు?
తదుపరి ప్రాజెక్టులు
ప్రస్తుతం ‘జో అచ్యుతానంద’ సినిమాలో నటిస్తున్నాను. 65 శాతం షూటింగ్ పూర్తయింది. అలాగే సుకుమార్ ప్రొడక్షన్‌లో హుసేన్‌షా కిరణ్ దర్శకత్వలో మరో సినిమా కూడా చేస్తాను.
అందరికీ నచ్చేలా..
‘ఒక మనసు’ చిత్రం ఓ అందమైన ప్రేమకథతో అల్లిన దృశ్యకావ్యంలా వుంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తాను.

-శ్రీ