యాక్టర్ కాకుంటే పైలెట్ అయ్యేదాన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ భామ దిశాపాట్ని. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సి.కల్యాణ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ దిశా పాట్ని చెప్పిన విశేషాలు...
తొలి అవకాశం
నిజానికి రెండేళ్ల క్రితమే ఓ సినిమా కోసం పూరి జగన్నాధ్ దగ్గరికి ఆడిషన్‌కు వెళ్లాను. కానీ ఆ సినిమాలో హీరోయిన్‌గా చేయడం కుదరలేదు. ఆ తరువాత మళ్లీ పూరి జగన్నాధ్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. అలా ఈ సినిమాలో అవకాశం వచ్చింది.
మోడరన్ అమ్మాయిగా
చిత్రంలో పారిజాతం అనే పాత్రలో కనిపిస్తాను. మోడరన్‌గా వుంటూనే సాంప్రదాయాలకు విలువనిచ్చే అమ్మాయి. ముఖ్యంగా ఆమె కుటుంబంతో మంచి ఎమోషనల్ ఫీలింగ్‌తో వుంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఫ్యామిలీకి దూరంగా వుంటుంది. ఇలాంటి అమ్మాయి జీవితంలోకి హీరో ఎంటరైతే ఎలా వుంటుంది, ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే అంశాలతో పాత్ర సాగుతుంది.
పూరి స్టైలిష్ ఫిలిమ్ మేకర్
పూరి జగన్నాధ్‌గారితో పనిచేయడం నిజంగా మర్చిపోలేని అనుభూతి. ఆయన స్టైలిష్ ఫిలిం మేకర్. బాలీవుడ్‌లో అయితే ఒక సినిమా చేయడానికి ఆరు నెలల నుండి సంవత్సరకాలం పడుతుంది. కానీ పూరి రెండు నెలల్లో చాలా ఫాస్ట్‌గా సినిమా చేశారు. ఆయనెక్కడా టెన్షన్ పడరు.
వరుణ్‌తేజ్ సపోర్టు
వరుణ్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా ఎక్కడా అలాంటి గొప్పదనాన్ని ప్రదర్శించడు. తను చాలా హార్డ్‌వర్కర్. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో చాలా సపోర్టు చేశారు. అలాగే సీనియర్ నటి రేవతిగారితో పనిచేయడం ఆనందంగా వుంది.
నైనిటాల్‌నుంచి?
మాది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ప్రస్తుతం బరేలిలో వుంటున్నాం. నేను లక్నో, నోయిడాలో చదువుకున్నాను. బి.టెక్ రెండో సంవత్సరం పూర్తిచేశాను. ముంబాయిలో మోడల్‌గా చేస్తున్నాను. మోడల్‌గా చేస్తున్నపుడే సినిమాల్లో చేయాలనే ఆలోచన కలిగింది. ఒకవేళ యాక్టర్ కాకుంటే పైలెట్ అయ్యేదాన్ని.
పాత్ర నచ్చితే చాలు
నేను ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలే చేస్తానని అనను. అలాగే ఏ భాషలో అయినా కూడా నటిస్తా. నాకు యాక్షన్ ఫిలింస్ బాగా ఇష్టం. బ్రూస్‌లీ, జాకీచాన్ సినిమాలు చూస్తాను. జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటున్నాను. తెలుగులో నటిస్తున్నపుడు డైలాగులు చెప్పడం చాలా కష్టమనిపించింది. అయితే ప్రతి సీన్ చేయడానికి ముందు బాగా ప్రాక్టీస్ చేశాను. యూనిట్ కూడా ఎంతో సపోర్టు అందించింది. ఏదైనా సరే కష్టపడకుండా ఏదీ రాదు.
తదుపరి చిత్రాలు
తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ప్రస్తుతం బాలీవుడ్‌లో టైగర్‌ష్రాఫ్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నాను. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం తెలుగులో చర్చలు జరుగుతున్నాయి.

-శ్రీ