అలా నటించను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయినుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే నటనలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, గతంలో చెప్పింది చెప్పినట్లుగానే చేస్తోంది. అయితే ఆమెకు గుర్తింపు మాత్రం లేటుగా వచ్చినా నటనకు ఆస్కారమున్న పాత్రలే లభిస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కబాలి’ చిత్రంలో ఆమె నటిస్తోంది. గ్లామర్‌ను ఒలకబోయడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టదు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించడానికి సిద్ధమనే ఈ అమ్మడు, ఇప్పుడు ఐటెం సాంగ్ అంటే మాత్రం అలా తాను నటించలేనని చెబుతోంది. గతంలో ఐశ్వర్యా రాయ్, కరీనాకపూర్, కత్రినాఖైఫ్, ప్రియాంకా చోప్రా లాంటివాళ్ళందరూ ఐటెంసాంగ్‌లు చేసి ఉండొచ్చుకాక, తాను మాత్రం అలా నటించలేనని అంటోంది. ఎందుకూ అంటే ఐటెం పాటల్లో కేవలం అసభ్యత, అశ్లీలం మాత్రమే ఎక్కువగా ప్రజెంట్ చేస్తున్నారని, అదో అందమైన పాటలాగా చిత్రీకరించడం లేదని చెప్పుకొచ్చింది.!