విజువల్ వండర్‌గా నాగాభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో పెన్ మూవీస్, ఇన్‌బాక్స్ పిక్చర్స్, బ్లాక్‌బస్టర్ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారి రూపొందిస్తున్న చిత్రం ‘నాగాభరణం’. దిగంత్, రమ్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కె.ఇ.జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ, కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్టుతో క్రియేట్ చేసి ఓ పాత్రలా రూపొందించామని, 40 కోట్ల భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్నామన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, కోడిరామకృష్ణ ఇలాంటి చిత్రాలను అద్భుతంగా రూపొందించగలరన్న మాట మరోసారి రుజువు కానున్నదని తెలిపారు. పూర్వజన్మలో ఓ అమ్మాయి తన పగను ఈ జన్మలో ఎలా తీర్చుకుంది అనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, విజువల్ ఫీస్ట్‌గా రూపొందిందని దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు. ముకుల్‌దేవ్, రవి కాలె, అమిత్, రాజేష్ వివేక్, సాధుకోకిల, రంగాయన రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్:మకుటా విజువల్స్, పాటలు:కవిరాజ్, మాటలు:ఎం.ఎస్.రమేష్, ఎడిటింగ్:జానీ హర్ష, కెమెరా:వేణు, సంగీతం:గురుకిరణ్, సమర్పణ:స్టూడియో గ్రీన్, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం:కోడి రామకృష్ణ.