అంతేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాణా’, ‘లక్ష్మీకల్యాణం’ చిత్రాలతో పరిచయమైన కాజల్, మగధీర చిత్రంతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు కెరీర్‌ను ఇన్నాళ్లూ నెంబర్‌వన్ స్థానంలోనే గడిపిన కాజల్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆమె ఇటీవల నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ దగ్గర గలగలలాడడం లేదు. ఇక కాజల్ కెరీర్ ముగిసినట్లేనా, ఇక అంతేనా అన్నట్లుగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె నటించిన ‘బ్రహ్మోత్సవం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అట్టర్‌ప్లాప్ అవడంతో ఈ టాక్ వినిపిస్తోంది.
ఆమెను పిలిచి అవకాశాలు ఎవరిస్తారా అని చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘నక్షత్ర’ అనే ఓ చిత్రంలో అతిథి పాత్రలో మాత్రమే నటిస్తోంది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో అటు తమిళం, ఇటు హిందీ భాషల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి సన్నివేశంలో అయినా నటిస్తానంటూ హింట్లు ఇస్తోంది. దానికి తగ్గట్టు హిందీలో ఆమె చేసిన ‘దో లఫ్జోంకి కహాని’ కూడా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇక కాజల్ తన కెరీర్‌ను ఎలా కొనసాగించనుందో చూడాల్సిందే.