బ్రాహ్మణ ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన ‘శివం’ చిత్రాన్ని శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకంపై బ్రాహ్మణ పేరుతో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు విజయ్ ఎం, గుర్రం మహేష్‌చౌదరి. ఈ చిత్రంలోని ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ నిర్మాతలు తనకు మంచి మిత్రులని, కన్నడంలో ఈ సినిమా పెద్ద హిట్ అయిందని, చాలా బాగుందని, తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ, ఉపేంద్ర సినిమాలు చాలా భిన్నంగా వుంటాయని, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నీ ఆయన సినిమాలో ఉంటాయని, ట్రైలర్ బాగుందని, తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, కన్నడంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ తెలుగులో ఉపేంద్రకు మంచి ఫాలోయింగ్ వుందని, ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని ‘బ్రాహ్మణ’ పేరుతో విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సి.ఆర్.మనోహర్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: వినోద్ మనోహన్, కెమెరా: వెంకట ప్రసాద్, నిర్మాతలు: ఎం.విజయ్, గుర్రం మహేష్‌చౌదరి, దర్శకత్వం: శ్రీనివాసరాజు.