కడప కింగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పరాజయం తరువాత వెంటనే సినిమాను మొదలుపెట్టాడు పవన్‌కళ్యాణ్. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఖుషి’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వలో పవన్ నటిస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఒకటి మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి మొదట్లో ‘సరదా’, ‘సేనాపతి’ అనే టైటిళ్లు పెడుతున్నారంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి ‘కడప కింగ్’ అనే టైటిల్‌ను పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. దానికి బలమైన కారణమే వుంది. ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్ మరార్ తన బ్యానర్‌లో ‘కడప కింగ్’ టైటిల్‌ను రిజిష్టర్ చేయించడంతో ఈ వార్తలు బైటికొచ్చాయి. అయితే, ఈ విషయంలో ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతం పవన్ సరసన హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. మరి శరత్ మరార్ రిజిష్టర్ చేసిన కడప కింగ్ పవనేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది.