పాటలే శ్వాసగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ద్వాఠకా క్రియేషన్స్ పతాకంపై గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రవీందర్‌రెడ్డి రూపొందించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో బిగ్ సీడీని నాగార్జున, గోపీచంద్ విడుదల చేయగా, ఆడియో సీడీని ఎ.ఆర్.రహమాన్ ఆవిష్కరించారు. ట్రైలర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు వింటుంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్లినట్లు ఉంటుందని, మరిచిపోలేని అనుభూతి కలిగిందని అన్నారు. నాగచైతన్య నెల రోజుల క్రితం ఈ సినిమా పాటలు వినమని ఇచ్చాడని, అందులో వెళ్లిపోమాకే అనే పాట వింటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయని అన్నారు. అలాగే గౌతమ్‌మీనన్ విజువల్స్ ఈ పాటలకు జతయ్యాయని, ఎ.ఆర్.రహమాన్ చైతన్యతో రెండు చిత్రాలు చేసినందుకు ఆనందంగా వుందని అన్నారు. పాజిటివ్ థింకింగ్‌తో సాగే సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. మంచి థీమ్ ఉన్న తాను ఈ చిత్రానికి మంచి సాహిత్యం దొరకడంవల్ల అందరికీ నచ్చేవిధంగా పాటల్ని అందించానని, ఓ రకంగా గౌతమ్ మీనన్ విజువల్సే అలాంటి సంగీతం అందించడానికి తనకు దారి చూపిస్తాయని, అందుకే తన సంగీతంలో రిచ్‌నెస్ వినిపిస్తుందని సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అన్నారు. రహమాన్‌తో పనిచేయడం ఓ కలలాంటిది అయితే, గౌతమ్‌మీనన్‌తో పనిచేసే అవకాశం రెండుసార్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుందని, సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో మళ్లీమళ్లీ చేయాలనుకోవడం ఎవరికైనా సహజమేనని కథానాయకుడు నాగార్జున అన్నారు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం తన కెరీర్‌కు ఓ కొత్తదారి చూపిస్తుందన్న నమ్మకం వుందని, జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సినిమా కచ్చితంగా విజయవంతవౌతుందని, ప్రేమంటే రొమానే్సకాదు అందులో యాక్షన్ కూడా ఉంటుందని ఈ చిత్రం ద్వారా తాను తెలుసుకున్నానని అఖిల్ అన్నారు. రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు గౌతమ్‌మీనన్ అన్నారు. కార్యక్రమంలో కోన వెంకట్, సాయిధరమ్‌తేజ్, అనీల్‌రావిపూడి, కళ్యాణకృష్ణ, దశరథ్, డి.వి.వి.దానయ్య, మంజిమా మోహన్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.