మళ్లీ ఆడను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలో డబ్బుంటే ఏదైనా చేయచ్చు. మంచి పనీ చేయచ్చు. ఎవరికీ పనికిరాని పనీ చేయచ్చు. అలా ఈసారి చేతి నిండా డబ్బుండడంతో రకుల్‌ప్రీత్‌సింగ్ గ్యాంబ్లింగ్ ఆటకు సై అన్నదట. మన దేశంలో అయితే ఎక్కడపడితే అక్కడ అభిమానులు చుట్టేస్తారు కనుక రకుల్ ఈసారి లాస్‌వెగాస్ వెళ్లింది. ఆ పట్నం అంటేనే గ్యాంబ్లింగ్‌కు పెట్టింది పేరు. ఎన్నోసార్లు ఆ ఆట ఆడే ముచ్చటను వాయిదా వేసుకున్న రకుల్ ఈసారి నిజంగానే ఆటలో దిగేసింది. అనుభవ రాహిత్యంతో దాదాపు 200 డాలర్లు పోగొట్టుకుందట. మన కరెన్సీలో ఇది దాదాపు 15వేలకు సమానం. పోతే పోయింది గానీ మంచి అనుభవమైతే వచ్చింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ అయెనే.. మళ్లీ పెట్టుబడెవడిచ్చు అని పాడుకోకుండా ఇక జన్మలో ఈ ఆట ఆడనని శపథం చేసిందట. మొత్తానికి జాగ్రత్తపరురాలే కదా!